Skip to main content

Namaste NRI

బిల్‌గేట్స్‌ కు శుభవార్త..  త్వరలోనే 

మైక్రోసాఫ్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ త్వరలోనే తాత కాబోతున్నాడు.  ఆయన కూతురు జెన్నిఫర్‌ గేట్స్‌ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది.  ఈ  విషయాన్ని  ధ్రువీకరిస్తూ న్యూయార్క్‌లోని తమ ఇంటి ఆవరణలో బేబిబంప్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.  చాలామంది జెన్నిఫర్‌కు కంగ్రాట్స్‌ తెలిపారు.  చాలా సంతోషంగా ఉంది. చంటిబిడ్డను కలిసేందుకు మీ ఇద్దరినీ తల్లిదండ్రులుగా చూడబోతున్నందుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అని జెన్నిఫర్‌ తల్లి మెలిండా తెలిపారు. ఈజిప్ట్‌కు చందిన గుర్రపు స్వారీ నిపుణుడు నయెల్‌ నాజర్‌, జెన్నిఫర్‌ గేట్స్‌ల వివాహం పోయిన ఏడాది అక్టోబర్‌లో జరిగింది.

Social Share Spread Message

Latest News