కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం నేనెవరు. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో, భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుమలి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఆర్జీ సారథి, కెమెరా: సామల భాస్కర్, సహ నిర్మాతలు: పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి.














