Skip to main content

Namaste NRI

భారత్‌కు జీ 20 అధ్యక్ష పగ్గాలు

అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ అధికారికంగా చేపట్టింది. భారత్‌ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు.

  జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ… భారత్‌ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందు,  ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్‌ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు స్పష్టిం చేశారు.

Social Share Spread Message

Latest News