Skip to main content

Namaste NRI

సౌదీ అరేబియా  కీలక ప్రకటన…. ఐదు దేశాల వారికి మాత్రమే

సౌదీ అరేబియా  కీలక ప్రకటన కీలక ప్రకటన చేసింది.  హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ ఆన్‌లైన్‌లో ఉమ్రా వీసాను జారీ చేయడానికి బయోమెట్రిక్ నమోదును ప్రారంభించినట్లు కీలక ప్రకటన చేసింది.  అయితే, ఇది అన్ని దేశాల యాత్రికులకు కాదు. కేవలం ఐదు దేశాల వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్, ట్యూనిషియా, కువైత్, బంగ్లాదేశ్, మలేషియా నుంచి వచ్చేవారు బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా ఓడరేవుల ద్వారా ఉమ్రా చేయడానికి వచ్చే వారి రాక విధానాలను సులభతరం చేయడంతో పాటు యాత్రికులకు డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ షరతు లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఉమ్రా వీసా జారీ చేయడానికి తమ వేలిముద్రలను నమోదు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా సౌదీ వీసా బయో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీసా రకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ స్కాన్‌పై క్లిక్ చేసి దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్‌లోని వ్యక్తిగత ఫొటోను ధృవీకరించడానికి ముందు కెమెరా ద్వారా పూర్తి ముఖ చిత్రాన్ని తీయాలి. చివరగా10 వేలిముద్రలను కెమెరా ద్వారా ఎలక్ట్రానిక్‌గా స్కాన్ చేయడంతో బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Social Share Spread Message

Latest News