Skip to main content

Namaste NRI

  నేహాశెట్టి బర్త్‌డే స్పెషల్‌… బెదురులంక 2012  పోస్టర్‌ రిలీజ్‌ 

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా  లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెదురులంక 2012. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  బెన్నీ ముప్పానేని నిర్మాత. నేహాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని  ఆమె లుక్‌ను విడుదల చేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ నటనకి ప్రాధాన్యమున్న పాత్రని పోషించారు నేహాశెట్టి.  ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.   ఈ సినిమాలో అజయ్‌ ఘోష్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆటోరామ్‌ ప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాద్‌, దివ్య నార్ని తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.  ఇటీవలే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.  వీలైనంత త్వరగా  షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

Social Share Spread Message

Latest News