Skip to main content

Namaste NRI

వీకెండ్‌ పార్టీలో ఏం జరిగింది? 

అక్షిత్‌ అంగీరస, రమ్య రాజ్‌, రమ్య నాని, సిరి, బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వీకెండ్‌ పార్టీ. అమరేందర్‌ దర్శకుడు. బోయ చేతన్‌బాబు నిర్మించారు. సదా చంద్ర స్వరాలందించారు. ఈ చిత్ర పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకకు చంద్రబోస్‌, సుచిత్ర చంద్రబోస్‌, కాసర్ల శ్యామ్‌ తదితరులు హాజరయ్యారు. చంద్రబోస్‌ మాట్లాడుతూ  ఈ సినిమాలో పల్లెటూరి నేపథ్యంతో సాగే పాట ఆకట్టుకుంటుంది. నా సతీమణి సుచిత్ర కొరియోగ్రఫీ చేశారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ  90వ దశకంలో నాగార్జున సాగర్‌లో ఓ ఘటన జరిగింది. నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిని రేప్‌ చేశారు. అదే ఘటనపై బోయ జంగయ్య అడ్డ దారులు అనే నవల రాశారు. దాన్నే ఇప్పుడు వీకెండ్‌ పార్టీ గా నేటి పరిస్థితులకు తగ్గట్లుగా తెరకెక్కించాం అన్నారు.

Social Share Spread Message

Latest News