Skip to main content

Namaste NRI

భారత్‌లో పర్యటించనున్న జూనియర్‌ ట్రంప్‌

 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్‌ ్డ ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ ఈ  నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.  భారత్‌లో తన వ్యాపారాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.  భారత్‌లో  ట్రంప్‌ టవర్‌ ఢల్లీి ఎన్‌సీఆర్‌,  ట్రంప్‌ టవర్‌ కోల్‌కతా, ట్రంప్‌ టవర్‌ పుణె,  ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఇప్పటికే ఒక లగ్జరీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబైలోని హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం 2014లో లోధా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నది.  ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్‌  జూనియర్‌ ట్రంప్‌ ఉన్నారు. ఈ సంస్థ భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో తన ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. న్యూయార్క్‌కు చెందిన ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్‌తో భాగస్వామ్యం ద్వారా  భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెటోకి ప్రవేశించింది.  జూనియర్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఈ  ప్రాజెక్టులను ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. 

Social Share Spread Message

Latest News