Namaste NRI

వలేరీ జూలుష్నీ కీలక వ్యాఖ్యలు… 2023 మళ్లీ

ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రెమ్లిన్‌ దాడిలో ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసమవుతోంది.  రష్యాను నిలువరించేందుకు అక్కడి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్‌ కమాండ్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ వలేరీ జూలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, మార్చి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడొచ్చు. జనవరి చివర్లో దాడులు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమే. ఈ గ్యాప్‌లో తమ సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్దానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. యుద్దానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయం. ప్రస్తుతం రష్యా రెండు లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోంది. రాజధాని కీవ్‌పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడతాయనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events