Namaste NRI

క్షణం ఒక యుగం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ 

మనిష్‌, మధునందన్‌ హీరోలుగా, లావణ్య, అక్సా ఖాన్‌, అలివియా ముఖర్జీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం క్షణం ఒక యుగం.  శివబాబు దర్శకుడు.  రూప నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పష్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిత్రాలు తీసే నిర్మాతలను ప్రోత్సహించాలి. ఎందుకంటే వారు తీసిన చిత్రాలు  మినిమమ్‌ సక్సెస్‌ అయినా కొత్త సినిమాలు చేస్తూనే ఉంటారు అని అన్నారు. కొత్తవారిని ప్రోత్సహిస్తున్న నిర్మాత రూపగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ ఇవ్వాలి అన్నారు.  నటీనటులు, సాంకేతిక నిపుణులు పుల్‌ సపోర్ట్‌ చేయడంతో మా సినిమా బాగా వచ్చింది అన్నారు రూప. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నా మా చిత్రం  అందరికీ నచ్చుతుంది అన్నారు శివ బాబు. నటి ఆక్సాఖాన్‌ మాట్లాడుతూ  పోస్టర్‌ లాంచ్‌ చేసినందుకు డైరెక్టర్‌ త్రినాథరావుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమాకు కూడా బ్లెసింగ్స్‌ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events