దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో సర్కారు నౌకరి చిత్రం ప్రారంభమైంది. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయని సునీత, ఆమె భర్త రామ్ గౌరవ దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం ఫడిల్యా, ఆర్ట్ : రవి.














