Skip to main content

Namaste NRI

 హీరోగా సింగర్ సునీత తనయుడు.. సర్కారు నౌకరి షురూ..!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో సర్కారు నౌకరి చిత్రం ప్రారంభమైంది. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయని సునీత, ఆమె భర్త రామ్ గౌరవ దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం ఫడిల్యా, ఆర్ట్‌ : రవి.

Social Share Spread Message

Latest News