Namaste NRI

రాఘవ లారెన్స్ రుద్రుడు  ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ

 నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.  కతిరేసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌  రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌ను  సరికొత్త అవతారంలో చూడబోతున్నారు. వీర తిరుమగన్ చిత్రంలోని పాడాద పాటెలం పాట క్లాసిక్‌హిట్‌గా  ప్రేక్షకుల మనసులో స్థానం సంపాందించుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఆ సాంగ్‌ను  మరిన్ని హంగులతో ఫుట్‌ట్యాపింగ్‌  రీమిక్స్‌గా  ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఈ చిత్రంలో శరత్‌కుమార్‌  కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events