జై రమేష్, శ్రీదేవి, రుక్మిణి, భానుచందర్, కోట శంకర్‌రావు, శాంతకుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తున్నది. దర్శక నిర్మాతల ప్రయత్నం విజయవంతం కావాలి అన్నారు. నిర్మాత రమేష్ ఆర్.కె మాట్లాడుతూ పోలీస్ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాను. పాటలు, ఫైట్స్, ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శకుడు ఆసక్తికరంగా సినిమాను రూపొందించారు అన్నారు. జబర్ దస్త్ శాంతి కుమార్ మాట్లాడుతూ కామెడీ ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, ప్రముఖ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.