అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 60 ఏళ్ల పౌలా హర్డ్‌తో బిల్‌గేట్స్ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. బిల్ గేట్స్, పౌలా హర్డ్ ఏడాదిగా రిలేషన్‌లో ఉన్నారు. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు కూడా. బిల్ గేట్స్-పౌలా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, వారిది విడదీయలేని బంధం అని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు. టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్యనే ఈ పౌలా హర్డ్. క్యాన్సర్‌తో చాలాకాలం పోరాడిన మార్క్ 2019లో మరణించారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారట. దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్ గేట్స్-మెలిందా దంపతులు. ఈ ఇద్దరూ 1994లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమోకానీ పెళ్లైన 27 ఏళ్ల తరువాత విడిపోయారు.
