Namaste NRI

గుడ్ మార్నింగ్ అమెరికా షోలో హీరో రామ్‌చరణ్‌   

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో హీరో రామ్‌చరణ్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రామ్‌చరణ్‌  మాట్లాడుతూ రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. రాజమౌళిని మేమంతా ఇండియన్ స్పీల్‌బర్గ్‌  అని పిలుచుకుంటాం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ఎంతో సంతోషాన్నిస్తున్నది. అది భారతీయ సినిమాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రాజమౌళి తన తదుపరి సినిమాతో గ్లోబల్ మార్కెట్‌లోకి  అడుగుపెడతాడు  అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన తొలి తెలుగు నటుడు రామ్‌చరణ్‌   కావడం విశేషం. గతంలో భారత్ నుంచి ప్రియాంకచోప్రా, షారుఖ్‌ఖాన్‌  ఈ టాక్‌షోలో  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events