మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ కళ్యాణ్. పండు దర్శకుడు. ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు నక్కిన త్రినాథ్‌రావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు. సప్తగిరి, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఒక ప్రత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగిందని తెలిపిన మేకర్స్, త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి డైరెక్టర్: పండు, నిర్మాత: ఎన్ వి సుబ్బారెడ్డి, సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి, ఎడిటర్: వినోద్ అద్వయ్, డాన్స్: అనీష్, ఫైట్స్: మల్లేష్, పీఆర్ఒ: శ్రీధర్.