నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. తాజాగా ఈ చిత్రంలోని కనుల చాటు మేఘమా అనే తొలిగీతాన్ని విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ గీతాన్ని లక్ష్మీభూపాల్ రచించారు. అభాస్ జోషి ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ లక్ష్మీభూపాల్‌గారు సందర్భానికి తగినట్లు అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేశారు. చక్కటి మెలోడీతో అందరిని ఆకట్టుకునే పాట ఇది. అందమైన ప్రేమకథగా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అని చెప్పారు. సంగీత దర్శకుడిగా తన ఇరవై ఏళ్ల ప్రయాణంలో ఈ పాట ఎంతగానో సంతృప్తినిచ్చిందని కల్యాణి మాలిక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామ, సంగీతం: కల్యాణి మాలిక్, వివేక్ సాగర్, సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.