Namaste NRI

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ద ఎలిఫెంట్ విష్పరర్స్

ఆస్కార్ అవార్డుల్లో భారత్ బోణీ కొట్టింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద ఎలిఫెంట్ విష్పరర్స్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. దీనిని డాక్యుమెంటరీని దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది.  ఈ అవార్డు కోసం ద ఎలిఫెంట్ విష్పరర్స్‌తోపాటు  హావ్‌లౌట్‌ ,  హౌ డూ యూ మెజర్ ఏ ఇయర్?, ద మార్థా మిచెల్ ఎఫెక్ట్,  స్ట్రేంజర్ ఎట్ ద గేట్  డాక్యుమెంటరీలో పోటీపడ్డాయి. అయితే చివరికి ద ఎలిఫెంట్ విష్పరర్స్‌ను  ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం వరించింది. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా తెరకెక్కించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events