టాలీవుడ్ నటుడు సునీల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్ భువన విజయమ్. క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ఒకరంటే ఒకరికి పడని 8 మంది రచయితలు, అనుకోకుండా రైటర్‌గా మారిన ఒక దొంగ. ఎవ్వరినీ లెక్కచేయని ఒక పిచ్చోడు. చచ్చి కూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఒక ఆత్మ. ఇద్దరు యమభటులు, చిత్రగుప్తుడు, ఒక దేవకన్య అంటూ సినిమా పాత్రలను పరిచయం చేస్తూ సాగుతున్న టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ మూవీలో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.