మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా. జి.భవానీ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఏ2 పిక్చర్స్ పతాకంపై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్‌నివ్వగా, ఛోటా కె నాయుడు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సినిమాలోని బ్రహ్మ పాత్రను ఓ అగ్రహీరో పోషించబోతున్నారని, సోషియో ఫాంటసీ మైథాలజీ అంశాలు కలబోసిన కథాంశమిదని దర్శకుడు తెలిపారు. పోసాని కృష్ణమురళి, సునీల్, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: గోపీసుందర్, పాటలు: శ్యామ్ కాసర్ల, శ్రీమణి, రచన-దర్శకత్వం: జి.భవానీ శంకర్.