యువ హీరో ఉదయ్ శంకర్ తన కొత్త చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. మేఘా ఆకాష్ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ పతాకంపై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. మన్మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ ఫ్యామిలీ, థ్రిల్లర్, లవ్‌స్టోరి కలిసిన చిత్రమిది. ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం అని అన్నారు. నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ ఉదయ్‌తో రెండో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మంచి కాస్ట్ అండ్ క్రూతో ఆకట్టుకునే సినిమా నిర్మించబోతున్నాం అన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ నేను హీరోగా నటిస్తున్న ఐదో చిత్రమిది. ఈ సంస్థలో వరుసగా రెండో చిత్రంలో నటిస్తున్నాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుంది. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. ఈ చిత్రాన్ని కి మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు.