Namaste NRI

ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్ గా శ్రీవల్లి అడబాల

ఫిన్లాండ్ లో తెలుగు వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధి కోసం స్థాపించిన ‘ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్ గా శ్రీవల్లి అడబాల గారు ఎన్నికయ్యారు. 2015 లో మొదలయ్యిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఫిన్లాండ్ లో వున్న తెలుగు వారికి చేదోడు వాదోడు గ ఉంటోంది. ప్రపంచంలోనే ప్రజలు అత్యంత సంతోషం గా జీవించే దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానం లో ఉంటుంది.

ఈ దేశానికి ప్రధాన మంత్రి కూడా ఒక మహిళ. అలాగే మన ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కుడా మహిళా అధ్యక్షురాలు ఎన్నిక అవ్వడం గర్వకారణం. అలాగె ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ కంచెర్ల, కార్యదర్శిగా రోజా రమణి మొలుపోజు, కోశాదికారిగా లక్ష్మీ తులసి పునగంటి, తెలుగు మనబడి ప్రోగ్రాం సమన్వయకర్తగా గోపాల్ పెద్దింటి, కమిటీ సభ్యులుగా ప్రతాప్ కుమార్ గార, అభిలాష్ పెద్దింటి, గాయత్రి దశిక, కృష్ణ కొమండూరు, కిరణ్మయి గజ్జెల, రమణారెడ్డి కరుమూరు, సత్యసాయి బాబు పగడాల, సుభాష్ బొగాడి ఎన్నికయ్యారు.

ఈ కార్యవర్గం 25.03.2023 తేదిన ఉగాది, శ్రీరామనవమి సంబారాలని విజయవంతగా జరిపించారు. మున్ముదు మరిన్ని కార్యక్రమాలని జరుపుతామని, తెలుగు వారిని మరింత చేరువగా ఉంటామని అద్యక్షులు శ్రీవల్లి అడబాల తెలియజేసారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events