Namaste NRI

దూసుకొస్తున్న రామబాణం

గోపీచంద్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రామబాణం.  డింపుల్‌ హయతి కథానాయిక.  శ్రీవాస్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్‌, జగపతిబాబు పంచెకట్టులో సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు. ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని కలిపితే నేను అనే సంభాషణతో రూపొందించిన వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు ప్రజా నాయకుడిగా కనిపిస్తాడని, ఆయనకు అండగా నిలిచే అనుచరుడిగా గోపీచంద్‌ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, సామాజిక సందేశంతో రూపొందిస్తున్నారు.  ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళని స్వామి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events