టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్ణా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్‌తోపాటు పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 14న వరల్డ్‌వైడ్‌గా లాంఛ్ చేయాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడ్డది. కాగా మేకర్స్ తాజాగా ఉగ్రం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఉగ్రం చిత్రాన్ని మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. అల్లరి నరేశ్ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడుతున్నట్టుగా ఉంది .
















