బలగం చిత్ర యూనిట్ ను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అభినందించారు. జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన మూవీ బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. తెలంగాణ నేపథ్య కథ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇదిలా ఉంటె ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ను చిత్రసీమలో ప్రముఖులు అభినందించి, సన్మానించగా ..తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్మానించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత బలగం డైరెక్టర్ వేణుతో పాటు సినిమాలో నటించిన హీరో ప్రియదర్శినిని, సినిమాలో సాయిలు కూతురు క్యారెక్టర్ చేసిన రూపాలక్ష్మిని సన్మానించారు. బలగం సినిమాను వీక్షించిన మోహన్ బాబు, విష్ణులు సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.
కేవలం ఈ సినిమా ప్రశంసలకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేట్రికల్గా మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. రీసెంట్ గా అమెరికాలోని లాస్ ఏజెంలెస్ సినిమాటోగ్రఫి అవార్డు (LACA)లో బలగం సినిమా సినిమాటోగ్రపి విభాగం సత్తా చాటుకొన్నది. ఈ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ఆచార్య వేణును అవార్డు వరించింది. ఇంకా ఉత్తమ చిత్రంగా కూడా బలగం అవార్డును అందుకొన్నది.