మోసపూరితమైన పథకంతో ఒక బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.8211కోట్లు) సేకరించారన్న కేసులో చికాగోలోని ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన ఇద్దరు భారతీయ అమెరికన్లను అమెరికా న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఔట్‌కం హెల్త్ కంపెనీ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రిషీ షా (37), మాజీ అధ్యక్షురాలు శ్రద్ధా అగర్వాల్ (37), మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ ప్యూర్డీ (33) కార్పొరేట్ మోసాలకు పాల్పడ్డారని తేల్చుతూ ఫెడరల్ కోర్టు తీర్పు వెలవరించింది.


