జీవన్ హీరోగా నటిస్తున్న సినిమా మన్యం రాజు. వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై విజయ్ బాబు, వై. ప్రవీణ్, బి.పుష్పలత నిర్మిస్తున్నారు. సోమసుందరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్, జీవన్, భీమాస్ అశోక్, బేబీ పరిణిక తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సోమసుందరం మాట్లాడుతూ ఈ చిత్రానికి కష్టపడి పనిచేశాం. చిన్న చిత్రమైనా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ సరికొత్త కథా నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఫ్లాంక్లిన్ సుకుమార్.