Namaste NRI

సిలికాన్ వాలీలో ఘనంగా చంద్రబాబు జ‌న్మదిన వేడుక‌లు

 తెలుగుదేశం పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ  జ‌న్మదినాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర (ఎన్నారై ) టీడీపీ నేత‌ల ఆధ్వర్యంలో సిలికాన్ వాలీలో నిర్వహించిన కార్యక్రమం విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ చంద్రబాబు 1998లో ముఖ్యమంత్రిగా  సిలికాన్ వాలీలో పర్యటించిన విశేషాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో తన అనుబంధాన్ని వివరించి, 2024లో మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరాన్ని విశ్లేషించారు. చంద్రబాబు 100వ పుట్టినరోజు కూడా తన ఆధ్వర్యంలో జరిగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, లక్ష్మణ్ పరుచూరి, గోకుల్ రాచవరపు, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ గొంప, కోటిబాబు కోటిన, భాస్కర్ అన్నే, మోహన్ , కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, రవి , సాయి ఖమాబాపతి ,మధు కందేపి సాయి యనమదల, పాములు నారాయణ వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, వీరు వుప్పల, సుభాష్ ఆర్, రవికిరణ్ ఆలేటి, రవి ఆలపాటి, సతీష్ బొల్ల, ప్రకాష్ ఎన్, తమిళనాడు ఎన్నారై టీడీపీ నేత కుమార్ వేల్  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News