Namaste NRI

ఖుషీ నుంచి సమంత బర్త్ డే స్పెషల్ పోస్టర్

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.   ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సమంత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సమంత మెడలో ఐడీ కార్డ్‌ వేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాదిరిగా కనిపిస్తున్నది. చిరునవ్వులు చిందిస్తూ చాలా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం ఖుషి సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News