ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ మిస్సైళ్ల దాడి చేసింది. కీవ్‌తో పాటు పలు నగరాలపై ఇవాళ అటాక్ జరిగింది. ఈ దాడుల్లో సుమారు 12 మంది మృతిచెందారు. ఉమన్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ల సమూహంపై దాడి జరిగింది. ఆ ఘటనలో 10 మంది మృతిచెందారు. డిన్‌ప్రో సిటీలో ఓ మహిళతో పాటు మూడేళ్ల కుమార్తె చనిపోయింది. క్రిమెంచుకు, పోల్టావా పట్టణాల్లోనూ పేలుళ్లు సంభవించాయి. రష్యా దాడులు చేస్తోందని, అంతర్జాతీయ దేశాలు సహకారం అందించాలని జెలెన్‌స్కీ అన్నారు. గడిచిన 51 రోజుల్లో రష్యా మిస్సైల్ దాడి చేయడం ఇదే మొదటిసారి ని కీవ్ మిలిటరీ తెలిపింది. అయితే కీవ్‌లో సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం కలిగిందన్న విషయాన్ని తెలుపులేదు. 23 మిస్సైళ్లు, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేర్కొన్నది. కాగా రెండు నెలల అనంతరం కీవ్‌పై రష్యా దాడిచేయడం ఇదే ప్రథమం.


