తెలంగాణ సచివాలయం నిర్మాణం దేశంలోనే ప్రథమ సచివాలయమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నూతన సచివాలయం, కేసీఆర్ విజన్‌కు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన సచివాలయం మన రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వైట్ హౌజ్‌ను తలదన్నేలా మన సచివాలయం నిర్మాణం ఉందని, ఇది కేసీఆర్ విజన్‌కు నిదర్శనమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజా సౌకర్యార్థం ఇటువంటి సచివాలయాలు ప్రతి రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. హరిత ప్రమాణాలలో గోల్డ్ రేటింగ్‌తో పాటు మరెన్నో విజయాలకు, ప్రశంసలకు ఇది నాంది కావాలని, దేశంలోని ప్రముఖ కట్టడాల సరసన మన సచివాలయం నిలవాలని కాసర్ల ఆశాభావం వ్యక్తం చేశారు.


