ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23 వ తానా మహా సభల్లో బాగంగా నిర్వహిస్తున్న థీమ్ తానా కిక్ ఆఫ్ పోటీలు వీక్షకులను అలరించాయి. అన్ని విభాగాల్లో దాదాపు 112 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె పోటీ దారులను మారియు విజేతలను అభినందించారు.


దాదాపు 10 గంటల పాటు సాగిన ఈ ప్రోగ్రామ్ కు అట్లాంటా లో ఉంటున్న తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తానా అట్లంటా నాయకులను, TAMA, న్యాయ నిర్ణేత లకు, స్పాన్సర్స్ కు సహకరించిన అందరికీ తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి ధన్యవాదాలు తెలియజేశారు.


సహకరించిన TV9 తెలుగు , ఫుడ్ స్పాన్సర్స్ తెలుగు ఫుడ్స్, మదన్ మల్లిక్ మేదరమెట్ల, భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డ, మురళి బొడ్డు, బాంబే లౌంజ్, asdure గురు, నవీన్ సామినేని, రవికిరణ్ వద్దేమను ఫొటో గ్రాఫర్స్, ఈవెంట్ ఆర్గనైజర్, ధన్యవాదాలు తెలిపారు.


















