Namaste NRI

అన్‌ స్టాపబుల్‌ థియేట్రికల్‌ రిలీజ్ డేట్ ఖరారు  

రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అన్‌ స్టాపబుల్‌. అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ అనేది ఉపశీర్షిక. బిగ్‌బాస్‌ ఫేమ్‌ విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లు. ఎ2బీ ఇండియా ప్రొడక్షన్స్‌లో రజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ స్టాపబుల్ టీజర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా అన్‌ స్టాపబుల్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఈ చిత్రం విడుదల తేదీని మంత్రి మల్లారెడ్డి అనౌన్స్‌ చేశారు.  జూన్‌ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. సప్తగిరి, విజే సన్నీ తో పాటు సినిమా తారాగణం అంతా వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఈ చిత్రం  హిలేరియస్ ఎంటర్ టైనర్ అని భరోసా ఇస్తోంది. ఈ చిత్రానికి  రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు, నిర్మాత : రజిత్ రావు, బ్యానర్ : ఎ2 బి ఇండియా ప్రొడక్షన్,  ప్రోడ్యుసర్లు: షేక్ రఫీ, బిట్టు, రాము వురు గొండ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, డీవోపీ: వేణు మురళీధర్, ఎడిటర్ : ఉద్ధవ్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, స్టంట్స్ : నందు, కోరియోగ్రఫీ: భాను, పీఆర్వో : వంశీ- శేఖర్.

Social Share Spread Message

Latest News