నరేష్ పవిత్రాలోకేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మళ్లీ పెళ్లి. ఎం.ఎస్.రాజు దర్శకుడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో నరేష్ మాట్లాడుతూ నా రీల్‌లైఫ్ బాగున్నా, రియల్ లైఫ్ బాగోలేదు. ఈ విషయంలో మా అమ్మ కూడా బాధపడేది.ఇప్పుడు యాభై ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా అన్నారు.
ఒకప్పుడు ఎం.ఎస్.రాజుగారి సినిమాలో నటించాలకునేవాడిని. అలా వదిన వరస అయిన జయసుధ తో వాన సినిమాలో భార్యభర్తలుగా చేయించారు. డర్టీహరీ సినిమా చూశాక అందులో యంగ్ మాన్ ఆయనలో కనిపించాడు. ఆయనతో కొంతకాలం జర్నీ చేశాక ఓ కథ వినిపించారు. బాగా నచ్చి వెంటనే చేద్దాం అన్నా. అమ్మ కోరిక మేరకు విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్థాపించాం. ఇక ఈ సినిమా ఎం.ఎస్.రాజుగారు కాకపోతే మొదలయ్యేది కాదు. ట్రైలర్ లో కొద్దిగానే చూశారు. విడుదలయ్యాక ఆటంబాంబ్ పేలుతుంది. మే 26 న యు.ఎస్.ఎ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో విడుదల కాబోతుంది. ఇది తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తీశాం. వనితా పాత్ర ద్వారా సూర్యకాంతం ఛాయాదేవి మనకు వచ్చిందని అనుకుంటున్నా. అరుణ్‌దేవ్,అనంత్ శ్రీరామ్, సురేష్ బొబ్బిలి బాగా పనిచేశారు అని అన్నారు.

అనంతరం జయసుధ మాట్లాడుతూ, ఇది నాకు చాలా స్పెషల్ ఈవెంట్. ఎందుకంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఇండస్ట్రీలో అందరికీ కుదరదు. నాకు, నరేష్ కు దక్కిన అద్టృష్టం ఇది. విజయనిర్మలగారు పండంటి కాపురంలో నన్ను, నరేష్ ను నటులుగా పరిచయం చేశారు. ఆ తర్వాత మేము ఇద్దరమూ విడివిడిగా హీరో హీరోయిన్లుగా వందల సినిమాలు చేశాం. మంచి నటులు అని పేరు తెచ్చుకున్నాం. నరేష్ తో నిర్మాతగా అదృష్టం అనే సినిమా తీశా. ఆ కథ అడ్వాన్స్ ట్రెంఢీ గా ఉంటుంది. ఇక మళ్లీ పెళ్లి లో మేమిద్దరం నటించడం చాలా ఆనందంగా వుంది. అలాగే ఎం.ఎస్.రాజుగారి ప్రొడక్షన్ లో తీసిన ‘వాన’ సినిమాలో వైవిధ్యంగా మమ్మల్ని భార్యభర్తలుగా నటింపజేశారు. అలాగే ఎం.ఎస్.రాజుగారు మరిన్ని వైవిధ్యమైన సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పర్సనల్ విషయాలపరంగా మనం ఎవరికీ భయపడనక్కరలేదు. మే 26న ఈ సినిమాకు బిగ్ ఓపెనింగ్ వుంటుందని భావిస్తున్నాను అన్నారు.

పవిత్రాలోకేష్ మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాయి. ఆ సమయంలో నరేష్‌గారు ఓ శక్తిలా నాకు తోడుగా నిలబడ్డారు అన్నారు. మే 26న సినిమా విడుదలకానుంది. ఇంకా సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్, కరాటే కళ్యాణి, గౌతంరాజు, అశోక్ కుమార్, అనన్య, రోషన్, రవివర్మ, జడ్జి మాధవరావు ప్రత్యేక అతిథి. వెంకట్రావ్, వనితా విజయ్‌కుమార్, శివబాలాజీ పాల్గొన్నారు.
