Namaste NRI

దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక

తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌ సౌత్‌ ఇండియా 2023  కార్యక్రమాన్ని ఆగస్టు 12న దుబాయ్‌లో నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ అవార్డ్స్‌ బ్రోచర్‌ను హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్కే గౌడ్‌ మాట్లాడుతూ దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో మా అవార్డ్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తారని ఆశిస్తున్నాం. గత రెండేండ్లలో విడుదలైన చిత్రాలు ఈ పురస్కారాల కోసం ఎంట్రీలు పంపవచ్చు. ఏటా దుబాయ్‌లోనే ఈ అవార్డ్స్‌ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నాం  అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ 1964 నుండి నంది అవార్డ్స్ ఉన్నాయి.నంది అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్ కల, అలాంటిది 7 సంవత్సరాలక్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదములు. అలాగే సీనియర్ నటుల పేరుతో కూడా స్మారక అవార్డ్స్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియా నుండి కూడా సినీ, రాజకీయ ప్రముఖులు రావడం మరియు బాలీవుడ్ నుండి కుండా జితేందర్, జాకీ షరఫ్ తదితరులు రావడం గొప్ప విషయం.ఇలాంటి మంచి పని చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నా అభినందనలు అన్నారు.

 ఈ కార్యక్రమంలో రైటర్ మిట్టపల్లి సురేందర్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, హీరోయిన్ భవ్యశ్రీ, కోటేశ్వరరావు, రాదాకృష్ణ, బి. శ్రీనివాస్ గౌడ్,రాజ్, ప్రేమ్, శ్రీశైలం, వాహిద్, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events