హైదరాబాద్ వేదికగా నానాక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన నూతన అమెరికన్ కాన్సులేట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.ఇరు దేశాలు శాంతి భద్రతలపై మరింత కలిసికట్టుగా పని చేయాలని కోరారు.

247వ అమెరికన్‌ఇండిపెండెన్స్‌వార్షిక వేడుకల్లో భాగంగా భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌గార్సెట్టి ఈ కాన్సులేట్‌ను ప్రారంభించారు. 340 మిలియన్‌డాలర్లతో ఏర్పాటు చేసిన నూతన కాన్సులేట్ భవనం భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికా 247వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నా దృష్టిలో ఇది కాన్సులేట్ కార్యాలయం కాదు, సహృదయం నిండిన నిలయం. తెలుగు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష అని రాయబారి చెప్పారు.

