Namaste NRI

ఆపరేషన్‌ రావణ్‌ ఫస్ట్‌ లుక్‌  విడుదల

రక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ఆపరేషన్‌ రావణ్‌. సంగీర్తన విపిన్‌ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా పతాకంపై ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, కల్యాణ్‌ కృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించేందుకు రాధిక ఒప్పుకోవడమే మొదటి విజయంగా భావిస్తున్నాను. మా నాన్న వెంకట సత్య ఈ సినిమాకు దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. ఆయన అన్ని విషయాలు నేర్చుకుని దర్శకుడిగా మారారు.

మేకింగ్‌లో ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు. నా గత సినిమా పలాస విడుదల ముందు చెప్పాను ఆ సినిమా ఖచ్చితంగా ఆదరణ పొందుతుందని, ఇప్పుడు ఈ చిత్ర విజయంపై కూడా అదే నమ్మకంతో ఉన్నాం అన్నారు. నటి రాధిక మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. శ్రమిస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతారు అనేది నటిగా నా అనుభవంలో తెలుసుకున్నాను. కథను అందంగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకట సత్య రాజీ పడలేదు. కొత్త తరహా పాత్రల్లో నటించాలని కోరుకునే నాకు మరో మంచి క్యారెక్టర్‌ ఈ చిత్రం ద్వారా లభించింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events