జూలై 2, 3 తేదీల్లో ప్యారిస్ లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఐపి కళాశాల రిటైర్ ప్రిన్సిపల్ వీరయ్యకు ఆహ్వానం అందింది. నానో టెక్నాలజీ భవిష్యత్తు అనే అంశంపై నిర్వహించనున్న సదస్సుకు ఈయన స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ గత కొంతకాలంగా వైజ్ఞానిక అంశాలపై తాను పరిశోధన జరిపి ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిపారు. భారతదేశంలో ఎంపిక చేసిన ఇద్దరిలో టి. వీరయ్య ఒకరు కావడం విశేషం. గతంలో కోలాలంపూర్ తదితర దేశాల్లో జరిగిన సదస్సులో సైతం ఆయన భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించారు.


