శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి పెదకాపు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఓ సామాన్యుడి సంతకం ఉపశీర్షిక. విరాట్‌కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. భారీ సమూహంలో చేయి పైకెత్తి ఏదో స్లోగన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఇందులో హీరో విరాట్‌కర్ణ భారీ జనసమూహానికి అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. రాజకీయ, సామాజికాంశాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నదని, ఎమోషనల్ సోషల్‌డ్రామాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: మిక్కి జే మేయర్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


