సిద్ధార్థ్ హీరోగా త్వరలో టక్కర్ అనే సినిమాతో సరికొత్తగా అలరించను న్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రెయిన్ బో అనే పాట విడుదలైంది. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. నాయకానాయికలు కారులో వెళ్తూ దారిలో కలిసిన వారితో సరదాగా గడుపుతున్నట్లుగా పాట చిత్రీకరణ సాగింది. సిద్ధార్థ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.


