Skip to main content

Namaste NRI

మను చరిత్ర నుంచి ఇప్పుడే పరిచయమే పాటని లాంచ్ చేసిన సంయుక్త మీనన్

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మను చరిత్ర. మేఘా ఆకాష్‌, ప్రగతి శ్రీవాస్తవ్‌ కథానాయికలు.   భరత్‌ పెదగాని దర్శకుడు. ప్రొద్దుటూర్‌ టాకీస్‌ పతాకంపై ఎన్‌.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  సుహాస్‌, డాలీ ధనంజయ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటిస్తు న్నారు. తాజాగా ఈ చిత్రంలో ఇప్పుడే పరిచయం అనే పాటను కథానాయిక సంయుక్తమీనన్‌ విడుదల చేసింది. గోపీసుందర్‌ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని చంద్రబోస్‌ రచించారు. ఆర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. ఈ చిత్రం  నెల 23న విడుదలకానుంది.  ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, సంగీతం: గోపీసుందర్‌, రచన-దర్శకత్వం: భరత్‌ పెదగాని.

Social Share Spread Message

Latest News