అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న న్యూజెర్సీలో జరిగిన సభకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హరియాణా ఎంపీ దీపేందర్ హుడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రతినిధులందర్నీ ఆ సభకు ఆహ్వానించినట్లు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విస్మరిస్తున్న నీళ్లు, నియామకాలు, నిధులు అంశంపై చర్చ జరిగింది. అంతేకాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా చర్చించారు.