Skip to main content

Namaste NRI

నిఖిల్ స్పై మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

నిఖిల్‌   హీరోగా తెరకెక్కుతున్న మూవీ స్పై. ప్రముఖ ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ద‌ర్శకుడు.  నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్‌, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు.  యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్పల‌పాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఐశ్వర్య రాజేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

జూమ్ జూమ్ అంటూ సాగే మెలోడియస్ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. విశాల్ చంద్ర శేఖర్ స్వర పరిచిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. కిట్టు విస్సప్రగాడ సాహిత్యం అందించాడు. జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తు న్నారు.

Social Share Spread Message

Latest News