టాలీవుడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న సినిమా రంగబలి. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ బసంశెట్టి డైరెక్టర్. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్‌తో సాంగ్ ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ సాంగ్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రెండో సాంగ్ కల కంటూ ఉంటే అప్‌డేట్ కూడా అందించారు మేకర్స్. ఈ పాట ప్రోమోను లాంఛ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్ 19న లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం రంగబలి షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ జులై 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

