Namaste NRI

అమెరికా, చైనా మధ్య కీలక చర్చలు

 అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్,  చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌ను కలుసుకున్నారు. చైనా, అమెరికాల వివాదాస్పద వ్యవహారాల నడుమ బ్లింకెన్ చైనాకు రావడం కీలక అంశం అయింది. తాను అమెరికా విదేశాంగ మంత్రితో భేటీ అయినట్లు ఆ తరువాత చైనా నేత తెలిపారు. రెండుదేశాల ఉన్నతస్థాయి దౌత్యవేత్తల నడుమ విస్తృతస్థాయి సంప్రదింపుల తరువాత కొన్ని నిర్థిష్ట అంశాలపై పరస్పర అవగాహన కుదిరిందని చైనా అధినేత తెలిపారు. చైనాలో రెండు రోజుల పర్యటన తుదిరోజున బ్లింకెన్ జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య సర్దుబాట్లు కుదిరినట్లు చైనా నేత తెలియచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.అయితే ఏఏ అంశాలపై అవగావహన కుదిరిందనేది తెలియచేయలేదు. బ్లింకెన్‌తో చర్చలు అత్యంత రహస్యంగా , చాలా లోతుగా జరిగాయని అధికారులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events