అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి సిద్ధమయ్యేవారికి ఊరట కలిగించే విషయం . ఎంతో కాలంగా వేచి చూస్తున్న విద్యార్థి వీసా (ఎఫ్1) ఇంటర్వూల అపాయింట్‌మెంట్ స్లాట్లు విడుదలయ్యాయి. జులై నుంచి ఆగస్టు మధ్య కాలానికి ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. యుఎస్‌ట్రావెల్ డాక్స్. కామ్ సందర్శించి అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవచ్చని (యుఎస్ ఎంబసీ ) సూచించింది. అమెరికాలోఉన్నత విద్యకోసం ఏటా వెళ్లే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-168.jpg)
ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ సమయం లోనే మన దేశ విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులు వివిద వర్శిటీల నుంచి ఐ20 ధ్రువ పత్రాలను పొందారు. వీరికి ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా ల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వూలు ఉంటాయి. అమెరికాకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయ విద్యార్థి ఉంటున్నారని, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-168.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-166.jpg)