Namaste NRI

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS) అధ్యక్షులు శ్రీనూతి బాపయ్య చౌదరి ఆధ్వర్యంలో పెదనందిపాడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం

పెదనందిపాడు ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో 18-6-2023 న నాట్స్ అధ్యక్షులు శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు నాట్స్ మరియు గ్లౌ ఫౌండెషన్ అధ్వర్యంలొ శంకర్  కంటి ఆసుపత్రి వారిచే ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కాళహస్తి సత్యనారాయణ గారు, శ్రీ నూతి సుబ్బారావు గారు,శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు మరియు శ్రీ నర్రా బాలకృష్ణ గారి చేతులమీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మరియు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది పాల్గొని తమకు కావలసిన కంటి పరీక్షలను చేయించుకొని ఉచితంగా మందులను పొందారు వీరిలో సుమారు 50% మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి తేదీలు కేటాయించినారు. నూతి బాపయ్య చౌదరి  ఉత్తర అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోను మరియు  పెదనందిపాడులో అనేక సామాజిక, ఆధ్యాత్మిక మరియు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ఈ రోజు నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా  A రవి చంద్ర గారు IPS( Rted IG & Vice President of Retired Police Officers Association ), శ్రీ కాళహస్తి సత్యనారాయణ గారు ( ASP Rted & President of PED society ), నర్రా బాలకృష్ణ గారు( PAS కళాశాల పాలకవర్గ సభ్యులు), ముద్దన రాఘవయ్య గారు (M.Tech), శ్రీమతి ముద్దన నాగరాజ కుమారి గారు(ex MPP), శీలం అంకారావు గారు,  కుర్రా హరిబాబు గారు, కాకుమాను నాగేశ్వరరావు గారు, కళాశాల ప్రిన్సిపాల్  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events