అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త. తమదేశ వీసాలకు సంబంధించి అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థి, పర్యాటక వీసాలతో వెళ్లాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు తమ వంతు కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటే, ప్రస్తుతం ఎప్పుడు కావాలంటే అప్పటికి వీసా తేదీలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా ఆశావహులు పర్యాటక వీసా ( బీ1/బీ2) తేదీల కోసం వేచి చూస్తున్నారు. ఆది, సోమవారాల్లో అమెరికా ప్రభుత్వం రెండు రకాల వీసా స్లాట్లను విడుదల చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-171.jpg)
ఏటా ఆగస్టు, సెప్టెంబరులో ప్రారంభమయ్యే విద్యా సీజన్ లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ పరిధిలో విద్యార్థి వీసా తేదీలు ప్రతిసారీ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే భర్తీ అవుతుంటాయి. ఇప్పుడు మాత్రం సాట్లు వచ్చి 24 గంటలు దాటుతున్నా ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థి, పర్యాటక తదితరాలు కలిపి పది లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-171.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-169.jpg)