చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్‌ను అమెరికా తీరం వద్ద పేల్చివేసిన సమయంలో జీ జిన్‌పింగ్ ఆందోళనకు గురైనట్లు బైడెన్ వెల్లడించారు. అయితే జిన్‌పింగ్‌పై ఎందుకు బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదు.

కాలిఫోర్నియాలో జరిగిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. బెలూన్‌ను షూట్ చేసినప్పుడు జీ జిన్‌పింగ్ అప్‌సెట్ అయ్యారని, ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో తెలియదని బైడెన్ అన్నారు. చైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇటీవల అమెరికాకు చెందిన దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ బీజింగ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. బ్లింకెన్ పర్యటన ముగిసిన మరుసటి రోజే బైడెన్ ఈ కామెంట్ చేయడం విశేషం.
