హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇంకాస్త ముందుగానే సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-221.jpg)
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ పచ్చటి పంట పొలాల మధ్య కాఫీ ఆస్వాదిస్తూ రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కీ రోల్‌లో నటిస్తోంది. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-221.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-220.jpg)